కమాన్చౌరస్తా, నవంబర్ 24: సాధారణ పాఠ్య ప్రణాళికతో పాటు కళాశాలలో ఉన్న వివిధ సర్టిఫికెట్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన CHEMDRAW సర్టిఫికెట్ కోర్సును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం హిమబిందు మాట్లాడుతూ, ఈ CHEMDRAW ద్వారా రసాయన చర్యలను రాయడం, అణువుల నిర్మాణానికి సంబంధించిన విషయాలను సిద్ధాంతికంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్సు సమన్వయకర్త భాసర్, అధ్యాపకులు ఎం శ్రీధర్, భాసర్, శ్రీనివాస్, జీవీఆర్ సాయి మధుకర్, మహిపాల్ రెడ్డి, రాజ్ కుమార్, డాక్టర్ సురేందర్ రెడ్డి, ఓదెలు కుమార్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.