గంభీరావుపేట/ఇల్లంతకుంట/వేములవాడ రూరల్/ కోనరావుపేట/సిరిసిల్ల టౌన్, నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ ఆశయంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా సహకార సంఘాలు దోహదం చేస్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. మండల కేం ద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన 69వ అఖిల భారత సహకార వారోత్సవా లకు ఆయన హాజరై, సహకార జెండాను ఆవిష్కరించారు. అనారోగ్యంతో మృతి చెందిన డైరెక్టర్ కామిడి గంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని పాలకవర్గంతో కలిసి మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ, సహకార వ్యవస్థ తో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని జవ హర్లాల్ నెహ్రూ సంఘాలను బలోపేతం చేశారన్నారు. వారి జయంతి పురస్కరించుకుని 69వ అఖిల భారత సహ కార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో కేడీసీసీబీ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో సందుప ట్ల రాజిరెడ్డి, సలహాదారు పురం సత్యంరావు, డైరెక్టర్లు రాగుల అంజిరెడ్డి, మల్యాల రాజవీర్, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, చెరుకూరి మురళి, బోయిని నర్సయ్య, సభ్యులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని కేడీసీసీబీ కార్యాలయంలో జిల్లా డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్, సెస్ కార్యాలయంలో ఎండీ రామకృష్ణ సహకార జెండాలను ఆవిష్కరించారు. ఇక్కడ ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, బ్రాంచ్ మేనేజర్ దామోదర్, ఫీల్డ్ ఆఫీసర్ బాలయ్య, సెస్ ఎండీ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.
వేములవాడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో జెండాను పీఏఎసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి ఆవిష్క రించారు. ఇక్కడ వైస్ చైర్మన్ తూం లక్ష్మీకాంతారావు, డైరె క్టర్లు సంజీవరెడ్డి, అమృత, తోట రాజు, రాజయ్య, సీఈవో లక్ష్మణ్, నాయకులు అన్నారం శ్రీనివాస్, మ్యాకల శ్రీనివా స్, శేఖర్, మహేశ్ తదితరులు ఉన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు గాలిపెల్లి ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జెండాలను ఆవిష్కరించారు. రైతుల అభివృద్ధికి పీఏసీఎస్ అండగా ఉం టుందని వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి తెలిపారు. ఇక్కడ సీఈవో రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
కోనరావుపేట మండలంలోని కొలనూర్, కోనరా వుపేట ప్రాథమిక సహకార సంఘాల్లో ఘనంగా వారోత్స వాలు నిర్వహించారు. చైర్మన్లు సంకినేని రామ్మోహన్రావు, బండ నర్సయ్య జెండాలను ఆవిష్కరించారు. ఇక్కడ డైరెక్ట ర్ రమేశ్‌రెడ్డి, మేనేజర్ పవన్, సీఈవో కేశవులు ఉన్నారు.