వీణవంక, నవంబర్ 11: మంచి సందేశాత్మక సినిమాలు తీసి తెలుగు చిత్రసీమలో గ్రామీణ యువత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని ఘన్ముక్ల శ్రీభవానీ శంకరస్వామి ఆలయంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో గ్రామానికి చెందిన కేవీ రాజిరెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఫేర్వెల్ సినిమా షూటింగ్‌ను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుంచి సినీరంగంలో నిర్మాతగా పని చేయడం హర్షించదగిన విషయమని, ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలని సూచించారు. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కళాకారులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, కళాకారులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. చిత్ర బృందం రచ్చరవి, గంగవ్వ, మణి, స్నేహలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు అప్పని హరీశ్వర్మ కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
మండల కేంద్రంలో లస్మక్కపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు దళితబంధు లబ్ధిదారులు లారీ తీసుకోగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే, జమ్మికుంట జోయాలుకాస్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన సరస్వతీ శిశుమందిర్ రిటైర్డ్ హెడ్మాస్టర్ రంగాచార్యులు, సీనియర్ జర్నలిస్ట్ పిట్టల రాజేందర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, సర్పంచులు సునీత-మల్లారెడ్డి, మ్యాకల సమ్మిరెడ్డి, నీల కుమారస్వామి, కాంతారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్లు మధుసూదన్‌రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, నాయకులు మూల పుల్లారెడ్డి, మ్యాకల సత్యనారాయణరెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, వెంకటేశ్, తిరుపతిగౌడ్, నీల పున్నం, రవి, మధు, తదితరులు పాల్గొన్నారు.