సైదాపూర్, అక్టోబర్ 30: మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం వట్టిపల్లి, బట్టిపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్( టీఆర్ఎస్) నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటీకీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ (టీఆర్ఎస్ ) మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ బిల్ల వెంకట్‌రెడ్డి, సర్పంచులు బర్మావత్ అక్షయాశ్రీనివాస్ నాయక్, రేగుల సుమలతాఅశోక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా సమితి సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, ఫ్యాక్స్ డైరక్టర్ చాడ ప్రకాశ్‌రెడ్డి, నాయకులు బెదరకోట రవీందర్, ఎల్కపల్లి రవీందర్, దూల సురేశ్, బర్మావత్ శంకర్‌నాయక్, గోనెల శ్రీనివాస్, గడ్డం శ్రీధర్, కోటి, అశోక్, రమేశ్ తదితరులు ఉన్నారు.
ముదిరాజ్ సంఘం నాయకులు..
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా మర్రిగూడ, వట్టిపల్లి, భట్టిపల్లి గ్రామాల్లో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి, నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటికీ వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు.
హుజూరాబాద్ నేతలు..
హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 30: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి మండల నాయకులు ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో హుజూరాబాద్ కౌన్సిలర్లు మక్కపల్లి కుమార్‌యాదవ్, ప్రతాప తిరుమల్‌రెడ్డి, రాంపూర్ సర్పంచ్ చేరాల మనోహర్, నాయకులు గందె శ్రీనివాస్, పోరెడ్డి శంతన్‌రెడ్డి, గోవిందుల భాస్కర్, పోతరవేణి అనిల్‌యాదవ్, మొలుగు పూర్ణచందర్, బుర్ర నగరాజ్, బీ సంతోష్‌గౌడ్, టీ రమేశ్, రాకేశ్, రమేశ్‌యాదవ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ప్రచారంలో నవాబ్‌పేట్ నాయకులు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నవాబుపేట గ్రామాధ్యక్షుడు పిల్లి వేణు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి మండల నాయకులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మర్రిగూడ మండలం వట్టిపల్లిలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్(టీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు బోయిని మనోజ్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు మద్దెల రమేశ్, ప్రధాన కార్యదర్శి పోతరవేణి ఆగయ్య, పిల్లి యాదగిరి పాల్గొన్నారు.