గంగాధర, అక్టోబర్ 30: సర్కారు అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాత కు టుంబానికి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధరకు చెందిన బండారి లక్ష్మీనర్సయ్య అనే రైతు ఇటీవల మృతి చెందగా రైతు బీమా కింద మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం మంజూరైంది. కాగా ఆదివారం ఎమ్మె ల్యే స్వయంగా వారి ఇంటికి వెళ్లి కు టుంబ సభ్యులకు రైతుబీమా మంజూరుప్రతాన్ని అందజేశారు. అ సందర్బంగా సుంకె మాట్లాడారు. సమై క్య పాలనలో రైతులను పట్టించుకున్న వారు లేరన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ స ర్కారు రైతాంగం అభివృద్ధికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ లాంటి అనేక స్కీం లను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు సమాచార వారధులని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అ న్నారు. ఆదివారం మండలంలోని మధురానగర్ చౌరస్తాలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాల వద్ద భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కొండగట్టు ఆలయ డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఏఎంసీ మా జీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సర్పంచ్‌లు వేముల లావ ణ్య, వేముల దామోదర్, ముక్కెర మ ల్లేశం, పొ ట్టల కనుకయ్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, వ మధుసూదన్‌రెడ్డి, అంజి, ఆర్ శ్రీనివాస్, రమేశ్, అజయ్, చందు, అనిల్, అఖిల్ ఉన్నారు.