వేములవాడ, అక్టోబర్ 29: అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందు గా భగవంతనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టాల్సిన పనులను ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.
వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎంపిక చేసిన 15పాఠశాలల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న శ్యామకుంట సమీకృత మార్కెట్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. మార్కెట్ పనులు 80శాతం మేర పూర్తయినందున, మిగ తా పనులను నవంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు.
చెక్కపల్లి జంక్షన్ నుంచి కోరుట్ల జంక్షన్ వరకు 4వరుసల రోడ్డు, వట్టెంల రోడ్డు పనులకు టెండర్లు పిలువాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కూడళ్ల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. చిరు వ్యాపారుల కోసం తెలంగాణచౌక్‌లో దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూలవాగుపై వంతెన పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి తోపాటు ఆర్డీవో పవన్‌కుమార్, ఈఈలు సంపత్‌రావు, కిషన్‌రావు, కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ రాజిరెడ్డి, డీఈలు శాంతయ్య, ప్రశాంత్‌కుమార్, తిరుపతి, ఏఈ నర్మద, టీపీఎస్ శ్రీధర్, కౌన్సిలర్లు గోలి మహేశ్, నరాల శేఖర్ తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, అక్టోబర్29: సిరిసిల్లలోని బైపాస్ రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం ఆయన పాత బైపాస్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇక్కడ ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఈఈ కిషన్‌రావు, ఇరిగేషన్ ఈఈ అమరేందర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.