హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 23: టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రమేశ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, రమేశ్ రెడ్డికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మొక్క నాటిన రమేశ్‌రెడ్డి
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా తన పుట్టిన రోజును పురసరించుకొని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి మొక నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కోట్లాది మొకలు నాటడంతో తెలంగాణ నేలంతా పచ్చదనం పరుచుకుందన్నారు. దీంతో హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు-2022తో పాటు ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్’ అవార్డులు వచ్చాయన్నారు. వీటితోపాటు యాదాద్రి ఆలయానికి ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ అవార్డు వచ్చిందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజున మొకలు నాటే అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో సర్పంచ్ మాదాడి భారతి ఆధ్వర్యంలో నాయకులు, గ్రామస్తులు రమేశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. గ్రామానికి చెందిన మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామరాజు ఆధ్వర్యంలో శ్రీనివాస్, గొంతు సురేశ్ కరీంనగర్‌లోని రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. మండలానికి చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి రమేశ్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.