ఓదెల, అక్టోబర్ 23: మండలంలోని గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న తిప్పారపు రమేశ్ తల్లి గౌరమ్మ గుండెపోటుతో మరణించింది. పాలక వర్గం అంత్యక్రియల కోసం పాలకవర్గం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. గతంలో గౌరమ్మ భర్త నర్సయ్య కూడా జీపీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేశాడు. నిరుపేద కు టుంబం కావడంతో జీపీ పాలకవర్గం అంత్యక్రియలకు సాయాన్ని అందించి మానవత్వాన్ని చా టుకున్నది. కార్యక్రమంలో సర్పంచ్ గోవిందుల ఎల్లస్వామి, ఉపసర్పంచ్ రాజయ్య, వార్డు సభ్యు లు శారద, రాధ, సరిత, సుదర్శన్, సమ్మయ్య, మల్లీశ్వరి, శ్రీనివాస్, కార్యదర్శి దిలీప్ ఉన్నారు.
నల్లఫౌండేషన్ చేయూత..
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 23: పెద్దపల్లి మం డలం రాగినేడు గ్రామానికి చెందిన చీకటి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం టీఆర్ఎస్(బీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్‌రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల నగదును అందజేసి మానవతను చాటుకున్నారు.
మృతుడి కుటుంబానికి..
జూలపల్లి, అక్టోబర్ 23: కుమ్మరికుంట గ్రామా నికి చెందిన కత్తెర్ల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు.అనంతరం ‘నేనున్నా’ ఫౌండేషన్ తరపున రూ, 5 వేల నగదు అందజేసి ఉదారత చాటుకున్నారు. ఆర్బీఎస్ మం డలాధ్యక్షుడు విశారపు వెంకటేశం, నాయకులు కొప్పుల శ్రీధర్, నల్లతీగల సతీశ్, సూర ప్రభుదాస్, కందుల లచ్చయ్య, అంజయ్య, శ్రవణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంపిణీ..
పెద్దపల్లి, అక్టోబర్ 23: పట్టణంలోని తెనుగవాడకు చెందిన చుక్కయ్య పక్షవాతంతోబాధపడుతున్నాడు. అతడి కుటుంబానికి అమలాపురం ఆనంద్, మిట్లపల్లి రవీందర్ ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇక్కడ క్లబ్ అధ్యక్షుడు వేల్పురి సంపత్‌రావు, కంకటి శ్రీనివాస్, చందు, బండి సతీశ్ పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ విద్యార్థులు..
సుల్తానాబాద్ రూరల్/ఎలిగేడు అక్టోబర్ 23: మండలంలోని కాట్నపల్లికి చెందిన సీపతి సాత్విక తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందారు. అప్పటి నుంచి నానమ్మ కమలమ్మ సాత్విక బాగోగులు చూసుకున్నది. ఇటీవల ఆమె కూడా మరణించడంతో అన్న భార్గవ్ కూలీ పనులు చేసుకుంటూ పోషిస్తున్నాడు. సాత్విక ప్రస్తుతం గర్రెపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్న వీరిని ఆదుకోవడానికి నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సేవల ప్రేరణతో స్ఫూర్తి పొందిన లండన్‌లో చదువుకుంటున్న ఎన్ఆర్ఐ విద్యార్థులు వీరగోని శ్రీనివాస్‌గౌడ్, ప్రణయ్ తేజ, వారి సేహ్నితులు కలిపి రూ. 20 వేలు చందాలు పొగు చేసి పంపించారు. ఆదివారం వారి ఇంటికి వెళ్లి అందించారు. వీటితో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.5వేల విలు వైన నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమం లో ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు బూర్ల వెంకటేశ్వ ర్లు, కట్ల సత్యనారాయణ, ట్రస్ట్ బాధ్యులు వీరగో ని లక్ష్మీనారాయణ, రంగు రాములు, శ్రీనివాస్, మల్లారెడ్డి, సత్యనారాయణ, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యుడు మాతంగి రాజమల్లు ఉన్నారు.