మానకొండూర్, అక్టోబర్ 23: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చీకటిమామిడి గ్రామంలో స్థానిక సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్తోనే మునుగోడులో అభివృద్ధి సాధ్యమని, కారుగుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఇక్కడ టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామాధ్యక్షుడు జీడిమట్ల ధర్మయ్య, వైస్ ఎంపీపీ అనంత వీణ-లింగస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, టీఆర్ఎస్(బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ఆదివారం చండూరులోని ధోని పాముల గ్రామంలో దళిత వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మండల నాయకులు, దళిత విభాగం నాయకులు పాల్గొన్నారు.