బోయినపల్లి, అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36మందికి రూ.9.6లక్షలను ప్రభుత్వం సీఎం సహాయనిధి మంజూరు చేసింది. శనివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బూరుగుపల్లిలోని తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న నిరుపేదలకు సర్కారు అండగా ఉంటుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్నవారికి సీఎం సహాయనిధి మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ సంక్షే మ పథకాలు అందజేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు చిందం రమేశ్, టీఆర్ఎస్ నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి, అక్కెనపల్లి కరుణాకర్ ఉన్నారు.