శంకరపట్నం, అక్టోబర్ 15: అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని చెప్పారు. శనివారం కాంగ్రెస్, బీజేపీకి చెందిన 500 మంది యువకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అంతకుముందు పార్టీ నాయకులు తాడికల్ నుంచి కేశవపట్నం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్‌ర్యాలీ తీశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయిని టీఆర్ఎస్ (బీఆర్ఎస్)నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల చైర్మన్ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు వెంకటరమణారెడ్డి, కిషన్‌రావు, రాజయ్య, భద్రయ్య, మానస, రజిత, విజయ్‌కుమార్‌రెడ్డి, రవి, ఎంపీటీసీలు మొయిన్, సంపత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సంపత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.