కమాన్చౌరస్తా, అక్టోబర్ 15: జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో గల సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో శనివారం ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. విద్యార్థుల తల్లులు రకరకాల ఆహార పదార్థాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో విద్యార్థులకు ఆహారం యొక ప్రాధాన్యం, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
సంప్రదాయ వంటకాల యొక ప్రాముఖ్యతను నేటి ఆధునిక సమాజానికి తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని పలువురు తల్లులు తెలిపారు. వంటకాల్లో ఉత్తమ వంటకాలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. ఎంపికైన ఉత్తమ వంటకాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, అక్టోబర్ 15 : నగరంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో సూల్లో ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ వీ వనజానరేందర్ రెడ్డి హాజరై విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒకరి జీవితంలో ఆహారం ఎంతో కీలకమైందన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలతో ప్రదర్శనలో పాల్గొని, వాటి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.