మల్యాల, అక్టోబర్ 15 : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసగృహంలో మల్యాల మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానలో శస్త్ర చికిత్సలు నిర్వహించుకుని సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా మండలానికి చెందిన 45 మందికి రూ.12,75,500 మంజూరయ్యాయన్నారు.
కార్యక్రమంలో టీర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, టీఆర్ఎస్ ( బీఆర్ఎస్) నాయకులు మారంపల్లి నారాయణ, జున్న సురేందర్, అయిల్నేని కోటేశ్వర్రావు, ఆకుల నగేశ్, పొన్నం మల్లేశంగౌడ్, జోగినిపల్లి శ్రీనివాస్‌గౌడ్, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు.
కొడిమ్యాల, అక్టోబర్ 15 : మండలంలోని 18 మంది లబ్ధిదారులకు శనివారం బూర్గుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా రూ.3,85,400 అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు. ఎంపీటీసీ బసనవేని మహేశ్ ,నాయకులు అంబటి తిరుమలేశ్, గంగుల మల్లేశం, పర్లపల్లి ప్రభుదాస్, నేరెళ్ల మహేశ్, అజయ్‌రెడ్డి తదితరులున్నారు.