గంగాధర, అక్టోబర్ 15: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక మంజూరు చేసి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 91 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 21 లక్షల 98 వేల ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, బూరుగుపల్లిలోని నివాసంలో శనివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, సర్పంచులు శ్రీమల్ల మేఘరాజు, వేముల దామోదర్, ఆకుల శంకరయ్య, మడ్లపెల్లి గంగాధర్, పొట్టల కనకయ్య, మాల చంద్రయ్య, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు తోట మల్లారెడ్డి, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, వేముల శ్రీధర్, ఉప్పు ప్రశాంత్, సుంకె అనిల్, మ్యాక వినోద్, వేణు పాల్గొన్నారు.
చొప్పదండి, అక్టోబర్ 15: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో ఆయన మండలంలోని 31 మంది లబ్ధిదారులకు రూ.9,30,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే ధ్యేయంగా పని చేస్తున్నదని పేర్కొన్నారు. బాధితులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం మంజూరు చేసి ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుంట రవి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.