వెల్గటూర్, అక్టోబర్ 15: మండలంలోని పడకల్, పాత గూడూర్ గ్రామంలో హైనా సంచారం మరువకముందే సూరారంలో చిరుతపులి కలక లం రేపుతున్నది. గత బుధవారం పడకల్, పాతగుడూర్ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న సత్త య్య అనే రైతుకు హైనా కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి ‘హైనా’గా పాదముద్రలు గుర్తించిన విషయం తెలిసిందే. కా గా, శుక్రవారం సాయంత్రం సూరారం శివారులోని గుట్టకు మేకలు మేపేందుకు వెళ్లిన కాపరుల కు పులి అరుపులు వినిపించడంతో అటువైపు రాళ్లు రువ్వారు.
ఈవిషయాన్ని అటవీ అధికారులకు తె లుపడంతో శనివారం ఉదయం అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ పద్మ, బీట్ ఆఫీసర్ సంధ్య వచ్చి ఆయా ప్రాంతాలను పరిశీలించి, చిరుత పాదముద్రలు గు ర్తించారు. ప్రజలెవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, జీవాలను మేపేందుకు కాపరులు చిత్తడి ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.