గంగాధర/ చొప్పదండి అక్టోబర్ 15: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే బీజేపీ కుల రాజకీయాలకు తెరలేపిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. టీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవివచిన బూర నర్సయ్యగౌడ్ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు.
ఆయన వెళ్లిపోయినా వచ్చే నష్టం ఏమీలేదన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పట్టులేని బీజేపీ ఇతర పార్టీల నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. విజ్ఞులైన మునుగోడు ప్రజలు సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటారన్నారు. టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.