చొప్పదండి, అక్టోబర్ 12: నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మండిపడ్డారు. చొప్పదండి పట్టణంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. చొప్పదండి మున్సిపాలిటీకి రూ.70 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కే దక్కుతుందన్నారు. పట్టణంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదని విమర్శించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులను నిలిపివేయమనడం వారి అవివేకమని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, బందారపు అజయ్‌కుమార్, మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, లచ్చయ్య, రాజశేఖర్, డేవిడ్, మల్లేశం, సదాశివరెడ్డి పాల్గొన్నారు.