హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 12: సమాచార హకు చట్టం (ఆర్టీఐ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో యునైటెడ్ ఫోరం ఫర్ కాంపెయిన్ తెలంగాణ జిల్లా కో కన్వీనర్, జీకే రైతు మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి అధ్యక్షతన సమాచార హకు చట్టం – 2005పై పౌర సమీక్ష, చైతన్య సదస్సు జరిగింది. అలాగే వాగ్దేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి చైర్పర్సన్ హాజరై మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు రహస్యంగా ఉండేవని, సమాచార హకు చట్టంతో పరిస్థితి మారిపోయిందని, పాలనలో పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు పౌర సమీక్ష, చైతన్య సదస్సులో స్వామిరెడ్డి మాట్లాడుతూ, సమాచార హకు చట్టం- 2005 అమలులోకి వచ్చి 17 ఏండ్లు గడిచాయని తెలిపారు. అవినీతి నిర్మూలనకు, పారదర్శన పాలనకు ఇది ఎంతో దోహదపడుతున్నదని పేర్కొన్నారు. ఈ చట్టం ఆవశ్యకత గురించి వివరించారు.
సమాచార హకు చట్టంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు చైర్ పర్సన్ గందె రాధిక సర్టిఫికెట్లు అందజేశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సమాచార హకు చట్టం అమల్లోకి వచ్చిన 17 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పలువురు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టారు. ఆయా కార్యక్రమాల్లో జీకే రైతు మిత్ర మండలి రాష్ట్ర నాయకులు చందుపట్ల నరసింహారెడ్డి, ఏనుగు మహిపాల్‌రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, తిరుపతిగౌడ్, రామగిరి అక్షిత్, చందుపట్ల నరసింహారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, రచయిత పసుల స్వామి, ఆర్టీఐ కార్యకర్త సొల్లేటి సదాశివరెడ్డి, సోషల్ వరర్ రామ్ పద్మ, యూనియన్ డైరెక్టర్లు శనిగరపు శ్రీనివాస్, ప్రతాప్ సతీశ్, వేల్పుల ప్రభాకర్, మేకల నవీన్‌కుమార్, తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.