కలెక్టరేట్, అక్టోబర్ 12: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధితశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి వసతులు కల్పించాలన్నారు. బయోమెట్రిక్ విధా నం ఉన్నందున అభ్యర్థులను ఉదయం 8.30నుంచి కేం ద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4,266 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. కేంద్రా ల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
ఎస్పీ రాహుల్‌హెగ్డే మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు గానూ పోలీస్‌శాఖ తరఫున అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్రాల వద్ద ఎస్ఐ స్థాయి అధికారితోపాటు సిబ్బంది ఉంటారన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, ఇన్చార్జి డీఆర్వో టీ శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో పవన్‌కుమార్, డీఈవో రాధాకిషన్, డీఐఈవో మోహన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏవో గంగయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.