పాలకుర్తి, అక్టోబర్ 12: సమైక్య పాలకుల అస్తవ్యస్థ విధానాలతో దండుగైన వ్యవసాయ రంగం స్వరాష్ట్రంలో పండుగులా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. బుధవారం మండలంలోని పుట్నూర్‌లో 15 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
ఇప్పుడు దేశ రైతాంగం కేసీఆర్ సుపరిపాలన కోసం ఎదురుచూస్తున్నదని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ వ్యాల అనసూర్య రాంరెడ్డి, వైఎస్ ఎంపీపీ ఎర్రం స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, వైఎస్ చైర్మన్ కోల సంతోష్‌గౌడ్, సర్పంచ్‌లు రావుల శారద, పున్నం సాగర్, కోల లత, మల్తెత్తుల శ్రీనివాస్, వేణుగోపాల్‌రావు, ఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, చైర్మన్ బయ్యపు మనోహార్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కల్లెపు మదన్ మోహన్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇంజపురి నవీన్, రాజేశం, సత్యనారాయణ్, గోపాల్ ఉన్నారు.
అయ్యవారికి ఆర్థిక సాయం.. పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కోదండ రామాలయం అయ్యవారు వెంకటరమణ ఇల్లు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.