జగిత్యాల రూరల్, అక్టోబర్ 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, బీజేపీ నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివా రం విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభు త్వం నూకల ఎగుమతిని బ్యాన్ చేసిందని, జై శ్రీరాం, సోనామసూర్ బియ్యం ఎగుమతి చేయాలంటే 25శాతం సెస్ విధించిన కేంద్ర ప్ర భుత్వం పంజాబ్ రైతులు ఎగుమతి చేసే బి య్యానికి ఎలాంటి సెస్‌లు విధంచలేదని, దీం తో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇవన్నీ తెలిసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎందుకు విమర్శిస్తారన్నారు.
రాష్ట్రంలో దిగుబడి పెరిగినట్లు అన్ని రాష్ర్టాల్లో దిగుమతి పెరిగితే దేశానికి అధిక ఆ దాయం వచ్చే అవకాశం ఉండేదన్నారు. బి య్యం, నూకల ఎగుమతుల్లో విధించిన సెస్‌ను తీసివేసి ఎగుమతిని పెంచి వచ్చే ఆదాయంతో రైతులకు లాభం చేకూర్చే అంశంపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో 2014లో వరి 26వేల ఎకరాల్లో సాగుకాగా, 2018లో 41 వేల ఎకరాలు, 2022లో 70వేల ఎకరాలకు చేరుకుందని, వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగేందుకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు న్న చర్యలేనని ఉద్ఘాటించారు. 2014లో 68.14లక్షల ధాన్యం దిగుబడి రాగా, 2021 లో 218.53 లక్షల టన్నుల దిగుబడికి చేరుకుందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం నిల్వలకు రాష్ట్రంలో రూ. 1024 కోట్లతో గోదాములను నిర్మించామని, టెస్కా బ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గోదాంలు నిర్మించామన్నా రు. విదేశాల నుంచి ప్రతి వస్తువును దిగుమతి చేసుకోవడంమే దేశంలో రూపాయి విలువ పడిపోవడానికి కారణమన్నారు.
కేంద్రం గ్యాస్, పెట్రో ధరల నియంత్రణలో విఫలమైందన్నా రు. రైతు ముసుగులో ఉన్నకాంగ్రెస్ రైతు నాయకులు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలన్నారు. కేడీసీసీ జిల్లా సభ్యుడు ము ప్పాల రాంచందర్‌రావు, ప్యాక్స్ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, ఏనుగు మ ల్లారెడ్డి, రాజలింగం, నర్సింహారెడ్డి ఉన్నారు.