తిమ్మాపూర్ రూరల్, జనవరి 28: ఆర్థిక అవసరాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కోట్ల ఆస్తి ఉన్నా అత్యవసరానికో.. మరేదైనా పనికో ప్రతి మనిషి జీవితకాలంలో అప్పుచేయకుండా ఉండలేడు. కొంత మంది మంచివారు చెప్పిన సమయానికి తిరిగి ఇస్తున్నా.. కొంత మంది మొండివారు మాత్రం రుణాన్ని ఎగబెడుతున్నారు. దీంతో అవసరానికి అప్పు ఇచ్చిన వారు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. అయితే అప్పు ఇచ్చేటప్పుడు పకడ్బందీగా ప్రామిసరీ నోటు రాయించుకుంటే చట్టపరంగా రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
‘నేను నా అక్కర నిమిత్తం అప్పుగా తీసుకున్న రూపాయలను తిరిగి కోరినప్పుడు చెల్లిస్తానని ప్రామిస్ చేస్తూ రాసిచ్చే పత్రమే ప్రామిసరీ నోటు’. ఎంత ఆత్మీయ సంబంధం ఉన్నప్పటికీ డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎగనామం పెడితే చట్టపరంగా వెళ్లడానికి అనువుగా ప్రామిసరీ నోటును రాసుకోవాలి. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే.. మీ డబ్బు మీ చేతుల్లో ఉన్నట్టే..!