విద్యానగర్, సెప్టెంబర్ 16: కౌమార బాలికలకు వందశాతం హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారులు, పంచాయతీశాఖ అధికారులతో జిల్లాలో గర్భిణుల నమోదు, హిమోగ్లోబిన్ పరీక్ష, సీజనల్ వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌమార బాలికలకు ఈ నెల 23లోగా హిమోగ్లోబిన్ పరీక్షలను 100శాతం నిర్వహించాలని, రక్తహీనత ఉన్నవారిని గుర్తించి వారికి సరైన వైద్యచికిత్స అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా కొత్తపల్లి, గంగాధర, మానకొండూర్ మండలాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో ప్రత్యేకించి పారిశ్రామిక వాడల్లో డ్రైడేను నిర్వహించాలని, జ్వరపీడితులను గుర్తించి రక్త పరీక్షలు చేయించాలని చెప్పారు. డెంగ్యూ ప్రదేశాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తీవ్ర, తకువ పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. అంగన్ వాడీ సూపర్ వైజర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, జిల్లా వైద్యాధికారి జువేరియా, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సబిత, డీపీవో వీరబుచ్చయ్య, ప్రోగ్రాం అధికారులు, సీడీపీవోలు వైద్యాధికారులు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
సేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పట్టు పురుగులు, లక సాగు, తేనెటీగల పెంపకం కోసం బ్యాంకుల ద్వారా అందించే సేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో ప్రత్యేక జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టు పురుగులు, లకసాగు, తేనెటీగల పెంపకం కోసం కేసీసీ ద్వారా 2022-23 సంవత్సరానికి సేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయిల్ పాం సాగుకోసం ఇస్తున్న రుణ మంజూరును టర్మ్ లోన్‌తో పాటు కేసీసీ ద్వారా మంజూరుకు సూచించి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ, హైదరాబాద్‌కు సిఫారసు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్ సత్యనారాయణ రావు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏజీఎం పీ అనంత్, డీడీఎం నాబార్డ్ ఆంజనేయులు, లీడ్ జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.