గంగాధర, సెప్టెంబర్ 16 : ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ రమణ డిమాండ్ చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగం గా ఎమ్మెల్యేరవిశంకర్ ఆధ్వర్యంలో గంగాధరలో శుక్రవారం సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్వశక్తి సం ఘం మహిళలు, యువకులు, విద్యార్థులు దాదా పు 20 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మలు, బోనాలతో మహిళలు ర్యాలీకి తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఒగ్గుడోలు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, విద్యార్థుల నృత్యాల మధ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ పతాకాలను చేతబట్టి ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గంగాధర జడ్పీ ప్రభుత్వ పాఠశాల నుంచి మధురానగర్ చౌరస్తా వరకు రెండు కిలో మీటర్ల మేర ర్యాలీ సాగింది. దీంతో మండల కేంద్రానికి వెళ్లే దారి, మధురానగర్ చౌరస్తా జన సంద్రమైంది. అనంతరం మధురానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు.
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించి సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ నిర్ణయం యావత్ తెలంగాణ దళితజాతికి గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభు త్వం పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశా రు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మా ట్లాడుతూ.. అంబేద్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెడతామని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణ యం తీసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ గౌడ్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీలు శ్రీరాం మధుకర్, పర్లపెల్లి వేణు, చిలుక రవీందర్, కలిగేటి కవిత, జడ్పీటీసీలు పునుగోటి ప్రశాంతి, రామ్మోహన్రావు, కత్తెరపాక ఉమ, మాచెర్ల సౌజన్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, గంట్ల జితేందర్‌రెడ్డి, కత్తెరపాక కొండయ్య, పులి వెంకటేశ్‌గౌడ్, కొండగట్టు డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, బండపెల్లి యాదగిరి, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, మెన్నేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర, పునుగోటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.