హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 6: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధుతో వేలాది కుటుంబాలకు బతుకుబాట చూపామని మాజీ ఎంపీ కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు పేరొన్నారు. మంగళవారం దళిత బంధు యూనిట్ హుజూరాబాద్ టిప్పర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో కెప్టెన్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి వారి సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నారని చెప్పారు. పథకం ఫలాలతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. కాగా, యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఓ ప్రణాళికా ప్రకారం సద్వినియోగం చేసుకొని మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
దళిత బంధు టిప్పర్ల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా కెప్టెన్
హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో దళిత బంధు టిప్పర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ఏర్పడింది. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల సమ్మయ్య(ద్వారక), ప్రధాన కార్యదర్శిగా బొరగాల కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గౌరవ సలహాదారుడిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా పాక సతీశ్, బొడ్డు సంజీవ్‌కుమార్, ముక రమేశ్, ఎర్ర రవీందర్, బత్తుల భాసర్, సహాయ కార్యదర్శులుగా చౌడమల్ల రాజు, కనకం సంపత్, ఎర్ర కుమార్, కార్యవర్గ సభ్యులుగా బొరగాల మోహన్, బోరగాల ప్రసాద్, గిన్నారపు ప్రసాద్, సందమల్ల మొగిలి ఎన్నికయ్యారు.