ధర్మారం, సెప్టెంబర్ 5: మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఈశ్వర్ సందర్శించగా, ఇక్కడ మహిళలు, యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండపంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఇక్కడ శ్రీరామాలయంలో ఆయన దర్శించుకున్నారు. పాత బస్టాండ్ యువకులు బోయవాడలోని వినాయక మండపంలో ప్రతిష్ఠించిన లంబోదరుడిని, స్నేహ యూత్ ఆధ్వర్యంలో గణేశ్‌నగర్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఆయన దర్శించారు. మండపాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమాల్లో ఎంపీవో రమేశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచులు ఆవుల లత, కట్ట రమేశ్, ఏఎంసీ డైరెక్టర్లు గుండా సత్యనారాయణ రెడ్డి, సందినేని కొమురయ్య, మిట్ట సత్తయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, నాయకులు నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, మంద శ్రీనివాస్, గుజ్జేటి కనకలక్ష్మి, ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, అజ్మీరా మల్లేశం, దేవి వంశీకృష్ణ, సల్వాజి మాధవరావు, రాసూరి రాజ్‌కుమార్, మానుపాటి సాగర్, సాన రాజేందర్, మిట్ట భరత్, దేవి అజయ్, సామంతుల నర్సింగం, ధర్మాజి నరేశ్, మగ్గిడి శంకరయ్య తదితరులున్నారు.
పెద్దపల్లిలో చైర్పర్సన్..
పెద్దపల్లి 3వ, 8వ వార్డుల్లో ప్రతిష్ఠించిన గణనాథులను చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండపాల వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఇక్కడ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కొయ్యడ సతీశ్, నాయకులు కాశిపాక వాసు, వెన్నం రవీందర్, పల్లె మధు, నిఖిల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
నల్ల మనోహర్‌రెడ్డికి సన్మానం..
మండలంలోని పలు గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నల్ల మనోహర్‌రెడ్డిని శాలువాలతో సన్మానించారు.
మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వాహకులు సోమవారం కుంకుమ పూజలు, అన్నదానాలు నిర్వహించారు. పెగడపల్లిలో గణేశ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరెల్లి సుజాత రమేశ్ , టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు నూనేటి కుమార్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అన్నదానం ప్రారంభించారు.
రత్నాపూర్ రామాలయం వద్ద, సెంటినరీకాలనీ సీటూ, టీటూ, రాంనగర్ వాటర్ ప్లాంట్ వద్ద అన్నదానాలు నిర్వహించారు. ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య, జడ్పీటీసీ మ్యాదరవేన శారదాకుమార్, సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, పన్నూరు సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, ఉప సర్పంచ్ దబ్బాక సత్యరెడ్డి, దామెర శ్రీనివాస్, నాయకులు నాగెల్లి సాంబయ్య, రవీందర్, బత్తుల రమేశ్, ప్రశాంత్, నరేందర్, మధుకర్, ప్రశాంత్, ఉదయ్, ఆశ కుమారి, ప్రదీప్, రాజేశం, మల్లయ్య, శ్రీకాంత్, రవి తదితరులున్నారు.
ఎలిగేడు, సెప్టెంబర్ 5: నారాయణపల్లి, లాలపల్లి కుర్మవాడ గణేశుడి మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ మాడ కొండాల్‌రెడ్డి, సబ్బు శ్రీధర్ మాట్లాడారు. మహిళలు భూలక్ష్మీ, హనుమాన్, విఘ్ననాయకుడికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సహఫంక్తి భోజనాలు
పరశురాంనగర్‌లో ఎవర్ గ్రీన్ యూత్ వినాయక మండపంలో పిట్టల వెంకట కల్యాణి-ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో భోజనాలు నిర్వహించారు. ఇక్కడ అరుణ్య సాయి, అంజన సాయి, యూత్ సభ్యులు ఉన్నారు. తిలక్‌నగర్ సెంటర్లోని ఫ్రెండ్స్ యూత్ మండపంలో బొజ్జ బుచ్చయ్య, పుష్పలత, రఘు శ్రీ తేజ ఆధ్వర్యంలో గణపతి సన్నిధిలో సహపంక్తి భోజనాలు చేశారు. ఇక్కడ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ఎండీ ముస్తఫా, నాయకులు కాల్వ లింగస్వామి, యూత సభ్యులు కాసారపు శ్రీనివాస్ తదితరులున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అడ్డగుంటపల్లిలోని వైశ్య భవన్‌లోని గణపతి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఇక్కడ సంఘం నాయకులు రవీందర్, వెంకటరమణ, చంద్రప్రకాశ్ గుప్తా, చుక్కారపు వెంకటేశ్వర్లు, శ్రీరాములు తదితరులున్నారు.