హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జాగృతి, శ్రీవాగ్దేవి డిగ్రీ కళాశాల, మాతృశ్రీ డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలతో పాటు, మాంటిస్సోరి, శ్రీకాకతీయ, శ్రీచైతన్య, టెట్రా, కృష్ణవేణి, శ్రీ శాతవాహన హైస్కూల్స్, తదితర స్కూళ్లలో సోమవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడారు. గురువు గొప్పదనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, సెప్టెంబర్ 5: మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గురుపూజోత్సవం సందర్భంగా గురువులను పలువురు సన్మానించారు. న్యూ మిలీనియం స్కూల్లో నిర్వహించిన గురుపూజోత్సవానికి వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక అతిథిగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు బుర్ర విఠల్‌రావు, శ్యాంసుందర్‌ను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో అంజయ్య, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, సెప్టెంబర్ 5: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో కేతిరి వెంకటనర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రతి ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలని కోరారు. లస్మన్నపల్లిలో సర్పంచ్ కాయిత రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జూపాకలో..
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 5: మండలంలోని జూపాక ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా సర్పంచ్ అంకూస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమారాజేందర్, ప్రధానోపాధ్యాయులు మాధవరావు, సాంబయ్య, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏకశిల పాఠశాలలో ..
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 5: మండలంలోని తుమ్మలపల్లి గ్రామ శివారులోగల ఏకశిలా సీబీఎస్ఈ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ప్రిన్సిపాల్ లక్ష్మణ్ కేక్ కట్ చేసి ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కిరణ్మయి, స్టాఫ్ ఇన్చార్జి నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.