కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 5 : జిల్లాలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, డీఈవో జనార్దన్ రావు సత్కరించారు. 2022 సంవత్సరానికి 39 మంది ప్రభుత్వ, 17 మంది ప్రైవేట్ ఉత్తమ ఉపాధ్యాయులు, ముగ్గురు 100 శాతం ఉత్తీర్ణ సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను సన్మానించారు. అందులో సూల్ అసిస్టెంట్ విభాగంలో పీ సంతోష్ కుమార్ (జడ్పీహెచ్ఎస్ పచ్చునూర్), బీ మల్లయ్య (జడ్పీహెచ్ఎస్ కరీంనగర్ ), సీహెచ్ మల్లికార్జున్ (జడ్పీహెచ్ఎస్ మన్నేంపల్లి), డీ సంధ్య, డీ వసుంధర (జడ్పీహెచ్ఎస్, జంగపల్లి), దుర్దన కౌసర్ (జీహెచ్ఎస్ కరీంనగర్), ఆర్ మల్లింత శాస్త్రీ (జడ్పీహెచ్ఎస్ నవాబ్ పేట), ఎస్ రఘుపతి రెడ్డి (జడ్పీహెచ్ఎస్ ఇందుర్తి), బీ రమేశ్ (డ్పీహెచ్ ఎస్ చిగురుమామిడి), కే సమత (జడ్పీహెచ్ఎస్ చొప్పదండి), బీ తిరుపతి (జడ్పీహెచ్ ఎస్ జంగపల్లి), ఏ కుమారస్వామి (జడ్పీహెచ్ఎస్ ముదిమాణిక్యం), ఏ మెహన్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ గుండి), జే తిరుపతి రావు (జడ్పీహెచ్ఎస్ గంగాధర), ఎం కుమార్ (జడ్పీహెచ్ఎస్ వీణవంక), ఎం సదానందం, ఎం సదానంద చారి (జడ్పీహెచ్ఎస్ కోరపల్లి), ఎస్ మానస (జడ్పీహెచ్ఎస్ చొప్పదండి), ప్రధానోపాధ్యాయుల విభాగంలో జీ జ్యోతి (ఎంపీపీఎస్ దుర్శేడ్), పండిట్ల విభాగంలో జీ పుష్పలత (జడ్పీహెచ్ఎస్ ఒద్యారం), ఎస్డీ సలావుద్దీన్ (జడ్పీహెచ్ఎస్ దేశ్ రాజ్‌పల్లి), కే శ్రీనివాస్ జియ్యంగర్ (జడ్పీహెచ్ఎస్ పొలంపల్లి), కే మల్లయ్య (జడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట).
ఎస్జీటీ విభాగంలో జే రమ్య (ఎంపీపీఎస్ మానకొండూర్), పీ భాగ్యలక్ష్మి (ఎంపీపీఎస్ మొగ్దూంపూర్), అంతుల్ సలేహా సిద్దిఖీ (జీపీఎస్ అశోక్ నగర్), ఈ లింగారెడ్డి (ఎంపీపీఎస్ ఉల్లంపల్లి), పీ వినోద(ఎంపీయూపీఎస్ గునుకులకొండాపూర్), సీహెచ్ వెంకటనర్సింహారెడ్డి (యూపీఎస్ మైలారం), కే శ్రీలత (పీఎస్ కొత్తపల్లి), వై రమాదేవి (ఎంపీపీఎస్ పందికుంటపల్లి), ఎంఏ గౌస్ ఖాన్ (ఎంపీపీఎస్ రెడ్డి రామయ్యపల్లి), జీ శారద (ఎంపీపీఎస్ గొల్లపల్లి), ఈ సునీత (ఎంపీపీఎస్ గుడ్లపల్లి), సీహెచ్ ప్రవీణ్ కుమార్ (ఎంపీపీఎస్ రాయికల్ ), కే భాగ్యరేఖ (ఎంపీపీఎస్ సింగాపూర్ ), జే వీరస్వామి (ఎంపీపీఎస్ ఇల్లందకుంట). పీఈటీల విభాగంలో బీ శ్రీలక్ష్మి (జడ్పీహెచ్ఎస్ మన్నెంపల్లి), టీ హరికిషన్ (జడ్పీహెచ్ఎస్ కన్నాపూర్) సన్మానాలు పొందారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల విభాగంలో..
సిలివేరి మహేందర్ (మానేర్ సూల్, కరీంనగర్ ), ఆర్ శ్రీనివాస్ (శ్రీసరస్వతీ విద్యాలయం గంగిపల్లి), సీహెచ్ సంపత్ రెడ్డి (చైతన్య విద్యానికేతన్ చల్లూర్), జీ రవి (ఆకాస్ పబ్లిక్ సూల్ చొప్పదండి), సీహెచ్ వీరనర్సయ్య (సురభి కాన్వెంట్ గంగాధర), కేలిస్సి విన్సెంట్ (కేరళ సూల్ హుజూరాబాద్), ఎం వేణుగోపాల్ రావు (న్యూ కాకతీయ హుజూరాబాద్), జీ రఘుపతి రెడ్డి (న్యూ భారతి హైసూల్, జమ్మికుంట), జీ శశాంక్ రెడ్డి (ఫండస్ సూల్ కరీంనగర్), జీ రాజశేఖర్(గీతాంజలి రుద్రారం), ఆర్ అంజయ్య (నేచర్ సూల్ కొత్తపల్లి), జీ రాజశేఖర్ రెడ్డి (వాల్మీకి సూల్, కరీంనగర్), లలిత్ మోహన్ సాహూ (పారమిత సూల్ కరీంనగర్), జీ కమలాకర్ (విద్యాధరి సూల్ కరీంనగర్ ), వీ రాజేశ్వర్ (స్లేట్ సూల్ కరీంనగర్), మిథున్ జై మిస్రా (వివేకానంద సూల్ కరీంనగర్ ), జీ పద్మజ (రిషి సూ ల్, కరీంనగర్)ను మంత్రి, కలెక్టర్ సన్మానించి, అభినందనలు తెలిపారు.