కార్పొరేషన్, జూలై 15: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. వారం రోజులుగా కురిసిన వర్షాలతో మానేరు డ్యాంలోకి కొత్త నీరు వచ్చి చేరిన నేపథ్యంలో 34 ఎంఎల్డీ ఫిల్టర్‌బెడ్‌ను, నీటి శుద్ధీకరణ ప్రక్రియ విధానం, సంపులు, మోటర్ల పనితీరును పరిశీలించారు. శుద్ధిచేసిన నీటి శాంపిల్‌ను సేకరించి స్వయంగా పరీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలన్నారు. వర్షాలతో మానేరు డ్యాంలోకి కొత్త నీరు వచ్చి చేరినందున శుద్ధీకరణలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. నీటిని శుద్ధి చేసే సమయంలో సమపాల్లలో ఆలం కలిపి ఫిల్టర్ చేయాలన్నారు. సంపులు, పంపులు సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి శుద్ధీకరణ ప్రక్రియలో ఇబ్బందులు రాకుండా, సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్టాండ్ బై మోటర్లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఫిల్టర్ బెడ్ నుంచి రిజర్వాయర్లకు నీటిని పంపించే సమయానికి నీరు పూర్తి స్థాయిలో శుద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి శాంపిల్ సేకరించి ల్యాబ్‌లో పరీక్ష చేసిన తర్వాతే సరఫరా చేయాలన్నారు. మంచినీరు దుర్వాసన రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు నీటిని సరఫరా చేసే విషయంలో ఎకడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రిజర్వాయర్లకు సరఫరా చేసే సమయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. సరఫరాలో మురుగునీటితో మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పైపులైన్లకు లీకేజీ పడితే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
నాటిన ప్రతి మొకనూ సంరక్షించాలి
నగరంలో హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు కోరారు. శాతవాహన ఫార్మా సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నగర వన వాటికను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, హరితహారంలో ప్రతి ఒకరూ భాగస్వాములై పెద్ద సంఖ్యలో మొకలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొకలు నాటడంతో పాటు ఇంటింటికీ పండ్లు, పూల మొకలు పంపిణీ చేస్తామని తెలిపారు. మొక్కలను సంరక్షించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నగర వన వాటికల పేరిట పలు చోట్ల మొకలు నాటి సంరక్షిస్తున్నట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా ప్రధాన రహదారుల డివైడర్లతో పాటు రోడ్లకు ఇరువైపులా, డివిజన్లలో ఖాళీ స్థలాలు ఉన్న చోట మొకలు నాటుతామని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరాన్ని హరితవనంలా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వర్షానికి నాటిన మొకలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వన వాటికల మధ్యలో నడిచేందుకు వీలుగా మట్టి రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ జంగిలి ఐలేందర్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ మహేందర్, డీఈ లక్ష్మారెడ్డి, ఫిల్టర్ బెడ్ ఇన్చార్జి అజయ్, టీఆర్ఎస్ నాయకుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.