కోరుట్ల రూరల్, జూలై 10: రైలు ఢీకొని 80 గొర్రెలు మృతిచెందాయి. చిన్న మెట్పల్లి శివారులోని రైల్వేట్రాక్‌పై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమెట్పల్లికి చెందిన లక్కం రాజం రోజుమాదిరిగా తన గొర్రెలను మేత కోసం గ్రామ శివారుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గొర్రెలు రైల్వేట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్‌రైలు గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 80 జీవాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. కాగా, రూ. 8లక్షల నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ గ్రామానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
అనంతరం ఎమ్మె ల్యే విద్యాసాగర్‌రావుతో ఫోన్లో మాట్లాడించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే బాధితుడికి భరోసానిచ్చారు. సర్పంచ్ నూతిపెల్లి గంగరాజు, ఎంపీటీసీ సభ్యులు చేపూరి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బండి భూమయ్య, ఉప సర్పంచ్‌లు మారు శ్రీనివాస్, గడ్డం మల్లారెడ్డి ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.