సైదాపూర్, జూలై 7: కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉండి ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పెరుమాండ్ల రమేశ్ ఇటీవల మృతిచెందగా పార్టీ తరఫున బీమా సొమ్ము రూ. 2 లక్షలు మంజూరైంది. కాగా, బాధిత కుటుంబసభ్యులకు గురువారం ఆయన చెక్కు అందజేశారు. అలాగే, మండలానికి చెందిన ఏడుగురికి రూ. 1,85,000 విలువైన ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
అలాగే, వెన్నంపల్లి మాజీ సర్పంచ్ గనిశెట్టి శంకరయ్య ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, పైడిమల్ల సుశీల-తిరుపతిగౌడ్, అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, గాజర్ల సదానందం, ఎంపీటీసీ గాజర్ల భాగ్యాఓదెలు, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్, నాయకులు ముత్యాల వీరారెడ్డి, సారబుడ్ల రాజిరెడ్డి, మొలుగూరి చిరంజీవి, పైడిపల్లి అరవింద్, గుజ్జుల సాయిరెడ్డి, అశోక్‌రెడ్డి, మాదం స్వామి, రాజేందర్, పోతిరెడ్డి హరీశ్‌రావు, దూల సురేశ్, పరుకాల నారాయణ, తాళ్లపల్లి నరేశ్ తదితరులు ఉన్నారు.