చొప్పదండి, జూలై 7: టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలతో చేపట్టే ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణ పనులకు గురువారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజతో కలిసి భూమిపూజ చేశారు. అలాగే, తహసీల్ కార్యాలయ సమీపంలో నిర్మించిన వారసంత షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే కేసీఆర్ ధ్యేయమని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లెప్రగతి ద్వారా నేరుగా పంచాయతీ కార్యాలయాల ఖాతాల్లో, పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్ కార్యాలయాల ఖాతాల్లో డబ్బులు జమచేస్తూ పంచాయతీలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చొప్పదండి మున్సిపల్ అభివృద్ధికి రూ. కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే సెంట్రల్‌లైటింగ్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్లు వడ్లూరి గంగరాజు, కొత్తూరి మహేశ్, నలుమాచు జ్యోతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చరమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచ్ పెద్ది శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, బత్తిని సంపత్, చీకట్ల రాజశేఖర్, ఏనుగు స్వామిరెడ్డి, చీకట్ల లచ్చయ్య, మహ్మద్ అజ్జు, చెట్టిపల్లి పద్మ, జహీర్, మావురం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.