చొప్పదండి, జూలై 7: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై ఖాళీ సిలిండర్లను పెట్టి, కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్లు వడ్లూరి గంగరాజు, కొత్తూరి మహేశ్, నలుమాచు జ్యోతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచ్ పెద్ది శంకర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, బత్తిని సంపత్, చీకట్ల రాజశేఖర్, ఏనుగు స్వామిరెడ్డి, చీకట్ల లచ్చయ్య, మహ్మద్ అజ్జు, చెట్టిపల్లి పద్మ, జహీర్, మావురం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూలై 7: కేంద్రం తరచూ గ్యాస్ ధర పెంచుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతున్నదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు పేర్కొన్నారు. మధురానగర్ చౌరస్తాలో ఆయన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు వేముల అంజి, పెంచాల చందు, తాళ్ల సురేశ్, సుంకె అనిల్, చిలుముల రమేశ్, ఇరుగురాల రవి, సముద్రాల ఓంకార్, గంగాధర శ్రీకాంత్, తాళ్ల మధు, బాషుమియా, గుంటుకు ఆంజనేయులు, కవ్వంపెల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 8: మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల క్రితం రూ. 400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,105కు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు లంక మల్లేశం, మామిడి తిరుపతి, శనిగరపు అనిల్‌కుమార్, అర్జున్, ఎండీ మొయిజ్, బీ సురేశ్, కొడుముంజ లేఖరాజు, కాడిమ్యాల రాజేశం, గడ్డల రవి, జుట్టు లచ్చయ్య, మల్లేశం, గడ్డం మోహన్‌రావు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, జూలై 7: కేంద్రం గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కిన్నెర మల్లమ్మ, పైడిపల్లి రాజు, పద్మ, మణికంఠరెడ్డి, అరవింద్, బాణయ్య పాల్గొన్నారు.