వెల్గటూర్, జూలై 6 : సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రమే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగుల, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వెల్గటూర్ మండలం కోటిలింగాల నుంచి పాశిగామ వరకు కోటీ 50 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతోపాటు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, అందుకే ఇతర రాష్ర్టాల అధికారుల బృందాలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నాయన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలు, రైతులు తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను అక్కడ చేపట్టాలని బహిరంగంగా కోరుకుంటున్నారని చెప్పారు. అయినా బీజేపీ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి, యువతను రెచ్చ గొట్టడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచులు బొప్ప తిరుపతి, నక్క మౌనిక రవితేజ, చల్లూరి రూపారాణి రాంచందర్ గౌడ్, గెల్లు చంద్రశేఖర్, ఎంసీటీసీలు మూగల రాజేశ్వరి సత్యం, పోడేటి సతీశ్, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, వైస్ చైర్మన్ పోడేటి రవిగౌడ్, పాక్స్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, రత్నాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, నాయకులు పెద్దూరి భరత్, గాదం భాస్కర్, కొప్పుల రవీందర్, చుంచు మల్లేశ్, గాజుల భానేశ్ తదితరులు పాల్గొన్నారు.