కొత్తపల్లి, జూన్ 3: తెలంగాణ సాధన ఉద్యమంలో ఏనుగు రవీందర్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారని సుడా డైరెక్టర్ భూక్యా తిరుపతినాయక్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ ద్యావ మధుసూదన్‌రెడ్డి కొనియాడారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమ్ ఫహాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన సుడా డైరెక్టర్ భూక్యా తిరుపతినాయక్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ ద్యావ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉద్యమ నాయకుడైన రవీందర్‌రెడ్డిని గుర్తించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో రవీందర్‌రెడ్డి కుటుంబసభ్యులు, నాయకులు, పాఠకులు మొక్కలు నాటారు. అలాగే, టీఆర్ఎస్ యువజన నాయకుడు వెల్మ నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియో ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు గంగారెడ్డి, వర్మ, రవినాయక్, జీవన్, అనిల్, శ్రీను, శ్రావణ్, ప్రవీణ్, తిలక్, మధు, మురళీ, ఓంకార్, సతీశ్, కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.