కలెక్టరేట్, జూలై 3: అతడు చేసేది చిరు వ్యాపారమే అయినా సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తున్నాడు. ప్లాస్టిక్ నిర్మూలనపై వినూత్న ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కరీంనగర్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన మిర్యాల్‌కార్ కన్నయ్య టిఫిన్ డబ్బాతో వచ్చే కస్టమర్లకు 740 ధర ఉన్న కిలో మటన్‌ను 700కే విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించి తన మటన్‌షాపు ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి పలువురు అభినందిస్తున్నారు.