మంథని రూరల్/మంథని టౌన్ జూన్ 29: మరో పది నిమిషాల్లో ఇంటికి చేరేలోగా వారిద్దరిని మృత్యువు గుర్తుతెలియని వాహన రూపంలో పొట్టనబెట్టుకున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గాడిదల గండి గుట్టపై బుధవారం తెల్లవారుజా మున జరిగిన దుర్ఘటన ఖాన్సాయిపేటలో విషాదం నింపింది. నడిరోడ్డుపై విగతజీవులుగా మారిన వారిని చూసి బంధుమిత్రులు రోదించిన తీరు స్థాని కులను కలిచివేసింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖాన్‌సాయిపేటకు చెందిన జక్కుల కుమారస్వామి(52), పేరాల విమల(42) వేర్వేరుగా పని కోసం బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంథని బస్టాండ్‌లో కలుసుకున్నారు. ఒకే ఊరు కావడంతో విమల.. కుమారస్వామి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు.
మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదల గండి గుట్టపై వీరు వెళ్తున్న బైక్‌ను కాటారం నుంచి మంథని వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. కుమారస్వామికి భార్య స్వరూప, కుమారుడు సంజయ్, వివాహితురాలైన కూతురు సుప్రియ, విమలకు భర్త మాధవరావు, ఇద్దరు కొడుకులు ప్రసాద్, గోపాల్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ సతీశ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మంథని దవాఖానకు తరలించారు. మృతుడి భార్య జక్కుల స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
బాధితులకు పుట్ట మధు పరామర్శ..
గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన జక్కుల కుమారస్వామి, పేరాల విమల మృతదేహాన్ని స్థానిక పోస్టుమార్టం గదిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సందర్శించారు. ప్రమాద తీరును పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వీరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టాటాఏస్..బైక్ ఢీకొని..
పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాణాపూర్‌కు చెందిన పడాల కొమురెల్లి(48) మృతి చెందినట్లు బసంతనగర్ ఎస్ఐ అర్కుటి మహేందర్ యాదవ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..రాణాపూర్‌కు చెందిన కొమురెల్లి బుధవారం ద్విచక్రవాహనంపై భో జన్నపేటలోని అత్తగారింటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అప్పన్నపేట శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో టాటాఏస్ అలో ట్రాలీ బైక్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కొమురెల్లి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య నిరోష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు కారు ఢీ..యువకుడు మృతి
సిరిసిల్ల రూరల్ జూన్ 29: సిరిసిల్ల మున్సిపల్ ప రిధిలోని చంద్రంపేట శి వారులోని సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సిరిసిల్లలోని గణేశ్ నగర్‌కు చెందిన గొలి రాంప్రసాద్ (30) ఈ నెల 28న రాత్రి స్నేహితుడు అర్చనపల్లి వంశీతో కలిసి కారులో వేములవాడకు వెళ్తున్నారు. మార్గమధ్యలో సిరిసిల్లోని కొత్త చెరువు దాటిన తర్వాత వన్ వే రూట్లో సిరిసిల్ల వైపు వస్తున్న అర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాంప్రసాద్, వంశీని సిరిసిల్ల దవాఖానకు అక్కడి నుంచిమెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు రాంప్రసాద్ మృతి చెందాడు. రాంప్రసాద్ తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.