హుజూరాబాద్ టౌన్, జూన్ 23: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని వరంగల్రోడ్లో అవంతి రెస్టారెంట్, అన్నపూర్ణ థియేటర్ వద్ద స్వాగత్ రెస్టారెంట్‌ను వినోద్‌కుమార్ గురువారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే కరీంనగర్ రోడ్లో రాకేశ్ దళితబంధు కింద ఏర్పాటు చేసుకున్న పీకేఆర్ కార్ డెకార్స్ దుకాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అందరూ చేయూతనందించాలని సూచించారు. అనంతరం కొత్తపల్లి శ్రీనాగేంద్రస్వామి ఆలయ సమీపంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంపంగి రాజేందర్-రేణుక దంపతుల కుమారుడు పవన్‌కళ్యాణ్-కృష్ణవేణి, 29వ వార్డు కౌన్సిలర్ ముక రమేశ్ అన్న మొగిలి కుమారుడు కిశోర్‌కుమార్-నవ్యశ్రీ వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, కల్లెపల్లి రమాదేవి, పైళ్ల వెంకట్‌రెడ్డి, ముత్యంరాజు, విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, మొలుగు పూర్ణచందర్, సురేందర్‌రెడ్డి, కొండ్ర నరేశ్, బీఎస్ ఇమ్రాన్, కే రోషేందర్, ప్రతాప కృష్ణ, కోమల్‌రెడ్డి, చిట్టి కుమార్, సిరిమల్లె నాగరాజు, విడపు రాజు, అనురాగ్, బత్తుల సమ్మయ్య తదితరులున్నారు.