ఇల్లంతకుంట, మే 13: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పోలీస్నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహూల్‌హెగ్డే పేర్కొన్నారు. తెనుగువానిపల్లిలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ నేస్తం కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. గ్రామీ ణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని తెలిపారు. చోరీలు, రోడ్డు ప్రమాదాలు, బస్ సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని తెలిపారు.
ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. అలాగే మహిళలు, యువతులు ఆపద సమయాల్లో షీ టీం నంబర్‌కు (79011-32141) ఫోన్ చేయాలని కోరారు. వాట్సాప్ నంబర్ (63039-22572) ద్వారా కూడా సమాచారం ఇవ్వాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు.
ప్రభు త్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పోలీస్ అధికారి, ఎస్ఐ, సీఐ ఫోన్ నంబ ర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా సమాచారం ఇస్తే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచ్ వంచ లక్ష్మి, సీఐ ఉపేందర్, ఎస్ఐలు మహేందర్, లక్ష్మారెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు.