కార్పొరేషన్, ఆగస్టు 10: నగరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, అధికారులు బుధవారం ర్యాలీ తీసి, ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. స్థానిక 37వ డివిజన్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ జెండాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఈనెల 16న చేపట్టే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 9వ డివిజన్లో కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్, మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, బిల్ కలెక్టర్ ముస్తఫా, టీఆర్ఎస్ నాయకులు హరీశ్, మురళి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో జాతీయస్ఫూర్తి, దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుమార్, తిరుపతి, శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఆగస్టు 10: నగరంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. సుమారు 2000కు పైగా చిన్నారులు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని పెంపొందించే నినాదాలు చేశారు. కాగా, ర్యాలీని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా. వీ నరేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం భిన్న సంస్కృతీసంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ జెన్నెక్ట్స్ నుంచి మొదలైన ర్యాలీ కోర్టు చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. ర్యాలీలో జిల్లాలోని అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ సూల్స్ ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాంనగర్, ఆగస్టు 10: పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో మొకలు నాటే కార్యక్రమాన్ని సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులు మొకలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు కిరణ్ కుమార్, రమేశ్, జానీమియా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అలాగే, జిల్లా కేంద్రంలోని జైలు ఆవరణలో జిల్లా న్యాయ సేవ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బీ సుజయ్ మొక్కలు నాటారు. జిల్లా జైలు పర్యవేక్షణాధికారి సమ్మయ్య, జిల్లా సబ్ జైళ్ల అధికారి శ్రీనివాస్, జైలు వైద్యాధికారి రమేశ్, జైలర్ బీ రమేశ్, డిప్యూటీ జైలర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ సుధాకర్‌రెడ్డి, ఎల్ రమేశ్, లీగల్ ఎయిడ్ అడ్వకేట్ మహేశ్, గార్డింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్/కమాన్‌చౌరస్తా, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత స్వతంత్ర వజ్రోత్సవాలతో పౌరుల్లో దేశభక్తి, జాతీయాభిమానం పెంపొందుతుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కళాశాల ఆవరణ నుంచి కలెక్టరేట్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ తీశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల అధ్యాపకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టి నగర వాసుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారని కొనియాడారు.
అంతకుముందు కళాశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కే రామకృష్ణ, అధ్యాపకులు డా. శ్రీనివాస్, ఎం హిమబిందు, డా. వీ వరప్రసాద్, నారాయణ, సురేశ్‌కుమార్, నాయుడు, రాజు, నాగేశ్వర్రావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
విద్యానగర్, ఆగస్టు 10: నగరంలోని 19వ డివిజన్లో గల మైనార్టీ పాఠశాల ఆవరణలో కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఆగస్టు 10: హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో అడవుల శాతం పెరిగిందని ఎంపీపీ చిలుక రవీందర్ పేర్కొన్నారు. గుమ్లాపూర్‌లో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ అప్పిడి సౌజన్య, మండల పంచాయతీ అధికారి రాజగోపాల్, ఏపీవో రాజు, కార్యదర్శి నాగరాజు, అంగన్వాడీ వర్కర్లు, ఈజీఏఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఆగస్టు 10: మండలంలోని వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీర్ల సరోజన గ్రామస్తులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరోజన మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
పందికుంటపల్లిలో సర్పంచ్ మొగుల్ల ఎల్లయ్య గ్రామస్తులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, వార్డు సభ్యులు శ్రీకృష్ణ, వంగ రమణ, చంద్రమౌళి, దయ్యాల వీరయ్య, మడ్లపెల్లి శ్రీనివాస్, మొగుల్ల స్వప్న, అంగన్వాడీ టీచర్ మొగుల్ల రజిత, కార్యదర్శులు మధునయ్య, శ్రీనివాస్, నాయకులు చిమ్మల్ల మహేశ్, ప్రశాంత్, పెరుమాండ్ల శ్రీనివాస్, అంజయ్, తిరుపతి, చారి పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 10: మండలంలోని ఆయా గ్రామాల్లో స్వతంత్ర వజ్రోత్సవాల ఆకారంలో మొక్కలను ప్రదర్శించారు. పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ తీసి, మొక్కలు నాటారు. గ్రామస్తులు, విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఆగస్టు 10: నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. యాదవ మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు సందవేని గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు రాజేందర్ కుమార్, మంచాల రవీందర్, దాసరి రాజు, కేఎన్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ గోపాల్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 10: మండలంలోని దుబ్బపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ సిరిగిరి దుర్గ ఆధ్వర్యంలో 75 మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయుడు కోట లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోపాల్‌పూర్‌లో సర్పంచ్ ఊరడి మంజుల ఆధ్వర్యంలో క్రీడా మైదానం వద్ద ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్‌ను ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రారంభించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీవో, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నగునూర్‌లోని గుట్టపై ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్‌లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్ మొక్కలు నాటించారు. వార్డు సభ్యుడు బోనగిరి హన్మంతు, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీనగర్లోని ఫ్రీడమ్ పార్కులో సర్పంచ్ రుద్ర భారతి మొక్కలు నాటించారు.
పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్, రాములు, మునిరెడ్డి, ఉపసర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చేగుర్తిలోని ఫ్రీడమ్ పార్కులో సర్పంచ్ చామనపల్లి అరుణ మొక్కలు నాటించారు. పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ గాండ్ల విజయ, సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, గాండ్ల కొమురయ్య, రాజయ్య, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 10: మండలంలోని చామనపల్లిలో సర్పంచ్ బోగొండ లక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య చేతుల మీదుగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకుడు బోగొండ ఐలయ్య, ఉపసర్పంచ్ దావు నిర్మల, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, రాజశేఖర్, సరస్వతి, రాములు, లక్ష్మి, లావణ్య, లక్ష్మి, శ్రీనివాస్, లక్ష్మి, విజయ, ఆంజనేయులు, సువర్ణ పాల్గొన్నారు. జూబ్లీనగర్‌లో సర్పంచ్ రుద్ర భారతి ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్, ఉపసర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు, మునిరెడ్డి, రమేశ్, లక్ష్మయ్య, ఎంపీటీసీ చల్ల రమక్క, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చేగుర్తిలో సర్పంచ్ చామనపల్లి అరుణ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి రాజు, నాయకుడు చామనపల్లి రాజయ్య, ఉపసర్పంచ్ గాండ్ల విజయ, గాండ్ల అంజయ్య, వార్డు సభ్యులు గాండ్ల కొమురయ్య, రాజమౌళి, యువజన, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎలబోతారంలో సర్పంచ్ కట్ల లక్ష్మి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. నాయకులు చల్ల లింగారెడ్డి, కట్ల గౌతం రెడ్డి, అనిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గోపాల్‌పూర్‌లో సర్పంచ్ ఊరడి మంజుల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.