చొప్పదండి, మార్చి 30: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని చొప్పదండి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి భూపతి రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని శివకేశవాలయంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పట్టణంలో వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి, రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అభ్యర్థించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్లు మాడూరు శ్రీనివాస్, కొత్తూరు మహేశ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, మల్లేశం, కొత్తూరు నరేశ్, దండె కృష్ణ, ఎండీ జహీర్, మల్లేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.