Doctorate | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 28 : కాల్వశ్రీరాంపూర్ వాసి వొడ్నాల శివలింగంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. శివలింగం ‘ఏ స్టడీ ఆన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇన్వెస్టర్ ఫైనాన్సియల్ డెసిషన్ మేకింగ్’ అనే అంశంపై పరిశోధన నిర్వహించి, తన సిద్ధాంత వ్యాసాన్ని విశ్వవిద్యాలయానికి అందజేశారు.
ఈ పరిశోధనను వాణిజ్య విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం గంగాధర్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. సామాజిక మాధ్యమాలు పెట్టుబడిదారుల ఆర్థిక నిర్ణయాలపై చూపుతున్న ప్రభావాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఈ అధ్యయనం రూపొందించినట్టు శివలింగం తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం పట్టాను ప్రతిభతో పూర్తిచేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు, అనంతరం యూజీసీ నెట్-జేఆర్ఎఫ్ (UGC NET JRF), తెలంగాణ రాష్ట్ర సెట్ (TG SET)అర్హతలను సాధించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గంగాధర్ కు శివలింగం కృతజ్ఞతలు తెలిపారు.