CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 11: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మండలంలోని ఒల్లంపల్లి సుందరగిరి గ్రామాల్లోని పూలే విగ్రహాలకు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రమేష్, ఎస్సై సంధబోయిన శ్రీనివాస్, ఎంపీడీవో భాశం మధుసూదన్, సామాజికవేత్త, మాజీ సర్పంచ్ శ్రీ మూర్తి రమేష్, చిగురుమామిడి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, డిఎస్.పి జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ పూలే చిత్రపటానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప స్ఫూర్తిదాత అని అన్నారు. బహుజనుల కోసం స్వయంగా పాఠశాల స్థాపించి తమ అర్థాంగితో విద్యను అందించిన గొప్ప మేథావి అన్నారు. పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వంతడుపుల దిలీప్ కుమార్, ప్రశాంత్, రాజు, తిరుపతి, రాజు, కొమురయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.