జూలపల్లి, అక్టోబర్ 17 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి ఏఎంసీ చైర్మన్ గండు సంజీవ్ (50) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సంజీవ్ మిత్రులతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుండె నొప్పి తీవ్రం కావడంతో, ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాచాపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ ఎలిగేడు మండలం ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్గా పని చేశాడు. మృతుడికి భార్య ,కొడుకు, కూతురు ఉన్నారు.