Peddapalli | పెద్దపల్లి , ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగ యువకులకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు గాను ఏప్రిల్ 24న (గురువారం) రూమ్ నంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతి రావు తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ పెద్దపల్లి లో సంస్థలో 12 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, పోస్టులకు (పురుషులు, స్త్రీలు), ఏదైనా డీగ్రీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 25-30 లోపు, ఉండాలని తెలిపారు. ఈ పోస్టులు పెద్దపల్లి ప్రాంతము లో ఉన్నాయని, వేతనం నెలకు 18500/- ఉంటుందని చెప్పారు.
ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 24 న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో Room No.225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో, పెద్దకల్వల పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్థులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9652953759, 8985336947, నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు తెలిపారు.