బోయినిపల్లి, మే 4 : జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెందడంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం తెలిపారు. ఈ బాధాతప్త సమయం లో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
* ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ మృతి అత్యంత విషాదకరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శు క్రవారం ఉదయం అనిల్ కుటుంబ స భ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించనున్నట్లు చెప్పారు.