సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, ఆదివారం భోగితో మొదలు కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు తలస్నానం చేయించి, భోగిపండ్లను పోశారు.
ఉదయాన మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పండ్లు పోశారు. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి కాగా, పండుగను సోమవారం ఘనంగా జరుపుకొనేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది.
-వేములవాడటౌన్, జనవరి 14