జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బార్లో వెయిటర్‌ను కొట్టిచంపడం(Waiter murdered స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలోని స్వప్న బార్లో నేపాల్ చెఫ్ చరణ్‌దీప్ సింగ్ (35) అర్ధరాత్రి కిచెన్ సిబ్బందితో గొడవపడ్డాడు. సర్దిచెప్పేందుకు వెళ్లిన వెయిటర్ శ్రీనివాస్తోనూ చెఫ్ వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన చెఫ్ చరణ్‌దీప్ సింగ్ బీరు సీసాతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాస్ (44) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.