Jagityal : రాష్ట్రంలోని ఉద్యోగులకు టీఎన్జీవో అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి (Nagender Reedy) మాటిచ్చారు. శుక్రవారం మెట్టుపల్లి యూనిట్ శాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మెట్టుపల్లి యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్ స్వామి, కార్యదర్శి హరిప్రసాద్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డిలు అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడం, పెండింగ్ బిల్లులు చెల్లింపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వంటి వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘం ముందుకెళ్తుతుందని తెలిపారు. ఉద్యోగులకు టిఎన్జీఓ సంఘం అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల సమక్షంలో పలువురు ఉద్యోగులు టిఎన్జీఓ సంఘం సభ్యత్వం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా సహధ్యక్షులు ఎండి. మహమూద్, కోశాధికారి సాహెద్ బాబు, సంయుక్త కార్యదర్శి రాజేశం, టీజీవో ఉపాధ్యక్షులు విజేందర్, నాయకులు మోహన్, నరసయ్య, రమేష్, గంగాధర్, అభినయ్, మని చందన, రజిత, వెంకటేష్,