Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Balmuri Vidyasagar Rao | సర్పంచ్, వాళ్ల మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నేను వేసుకున్న కంటైయినర్‌ను జబర్ధస్తీగా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సొంత పెద్దనాన్న బల్మూరి విద్యాసాగర్ రావు ఆరోపించారు.
Balmuri Vidyasagar Rao | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన భూమిని కబ్జా చేసి, చంపుతానని బెదిరిస్తున్నాడని అతని సొంత పెద్దనాన్న బల్మూరి విద్యాసాగర్ రావు ఎస్పీకి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బల్మూరి విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నేను జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామ నివాసిని. 6 గుంటల భూమిని సత్యారావు దగ్గర ఖరీదు చేశాను.. సాదాబైనామా రాయించి ఇచ్చారు.. అట్టి బైనామాను నేను 2016లో సాదాబైనామా రెగ్యులరైజేషన్ కొరకు అప్లై చేసుకున్నా.. కానీ నేటి వరకు అది అమలు కాలేదు. దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత ఓ చిన్న గుడిసిలాగా ఉన్నదాన్ని తొలగించి రిపేర్ చేయించి రేకుల మాదిరిగా వేసుకున్నా. దానికి ఒక సంవత్సరం 26 నంబర్ ఇచ్చారు.. దాని తర్వాత 26/ 1 ఇచ్చారు. ఇక అప్పటి నుంచి అదే నంబర్ నా పేరు మీద కొనసాగుతున్నది.
అయితే పన్ను రషీదు కూడా 26/ 1 కే ఇస్తున్నారు. దాని తర్వాత ఈ సంవత్సరం దాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. ఆ భూమి వేరే వాళ్లదని గ్రామ సర్పంచ్ నా మీద దరఖాస్తు ఇచ్చారు.. మా తాత వెంకట్రావు పేరు మీదుంది అది.. ఇప్పుడు గ్రామ సర్పంచ్, వాళ్ల సంబంధీకులు వచ్చి రిపోర్ట్ చేసి నా పేరు మీద దరఖాస్తు ఇచ్చాడు. దాని గురించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానిపై నాకు ఎలాంటి రిప్లై రాలేదు.. పోలీస్ స్టేషన్ రమ్మంటే నేను పోయి విషయం చెప్పిన.. పేపర్లన్నీ అక్కడ సమర్పించా.. వాళ్లు ఏం చర్యలు తీసుకోలేదు.. దాని తర్వాత సర్పంచ్, వాళ్ల మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నేను వేసుకున్న కంటైయినర్‌ను జబర్ధస్తీగా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నా భూమిని కబ్జా చేశాడు, అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది
బల్మూరి వెంకట్ ఒత్తిడితో గ్రామ సర్పంచ్, అధికారులు నాకు నోటీసులు పంపారు
నేను గతంలో కొన్న భూమిని ఇప్పుడు అధికార బలంతో కబ్జా చేయాలని చూస్తున్నారు
– బల్మూరి వెంకట్ పెద్దనాన్న బల్మూరి విద్యాసాగర్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

